మాగనూర్: ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.7,85,30,829 బకాయిలు వెంటనే చెల్లించాలంటూ మండలంలోని వడ్వాట్ శివారులో ఉన్న శంకర లింగేశ్వర రైస్‌మిల్ యజమాని దండె తమన్నకు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో రైస్‌మిల్ గోడకు అతికించారు. బకాయిలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే ఏడు రోజుల్లోగా కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వానికి బకాయిపడిన మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఎందుకు వసూలు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.


