ఆరోగ్యశాఖలో మెరిట్‌ తప్పిదం! | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశాఖలో మెరిట్‌ తప్పిదం!

Nov 29 2026 2:41 PM | Updated on Nov 29 2026 2:41 PM

పాలమూరు: జిల్లా వైద్యారోగ్యశాఖలో ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తప్పిదం చోటుచేసుకుంది. మెరిట్‌ జాబితా తయారీలో సిబ్బంది పొరపాటు కారణంగా తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి స్టాఫ్‌నర్సు ఉద్యోగం దక్కింది. మొత్తం 45 పోస్టులకు 1,575 మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 15 స్టాఫ్‌నర్సు పోస్టులకు 750 మంది పోటీపడ్డారు. ఈ పోస్టుల్లో 14 మందిని నిబంధనల ప్రకారం ఎంపిక చేయగా, మరో పోస్టు ఎంపికలో తప్పిదం జరిగినట్లు ఆలస్యంగా గుర్తించారు.

అసలు ఏం జరిగిందంటే..

కల్వకుర్తికి చెందిన వసంత స్టాఫ్‌నర్సు పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు వాస్తవంగా 824 మార్కులు రాగా, స్క్రూటినీ సమయంలో ఓపెన్‌ కేటగిరీలో పొరపాటున 969 మార్కులుగా నమోదు చేశారు. దీంతో మెరిట్‌ జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్న ఆమెకు అధికారులు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న మిడ్జిల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల్లో చేరారు. అయితే రాష్ట్ర కమిషనర్‌కు పంపాల్సిన తుది జాబితా తయారు చేసే సమయంలో మార్కుల వివరాలను పరిశీలించిన సిబ్బంది ఈ తప్పిదాన్ని గుర్తించారు. వాస్తవ మార్కుల కంటే 145 మార్కులు అదనంగా నమోదైనట్లు నిర్ధారించారు. దీంతో శనివారం ఆమెను డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి పిలిపించి నియామక ఉత్తర్వులను రద్దు చేశారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో సోమవారం రీ–మెరిట్‌ జాబితా ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

తక్కువ మార్కుల అభ్యర్థికి ఉద్యోగం.. మూడు రోజుల తర్వాత గుర్తింపు

145 మార్కులు అదనంగా నమోదు చేసిన సిబ్బంది

నియామక ఉత్తర్వులు రద్దు.. సోమవారం రీ–మెరిట్‌ జాబితా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement