పల్లె సంస్కృతి అద్దం పట్టేలా ‘హరికథ’ సినిమా | - | Sakshi
Sakshi News home page

పల్లె సంస్కృతి అద్దం పట్టేలా ‘హరికథ’ సినిమా

Nov 29 2026 2:41 PM | Updated on Nov 29 2026 2:41 PM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: పాలమూరు పల్లె సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ జీవనశైలిని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంతో పారడాక్స్‌ ‘హరికథ’ సినిమా రూపుదిద్దుకుందని ఉమ్మడి జిల్లా మక్తల్‌కు చెందిన చిత్ర దర్శకుడు అనుదీప్‌రెడ్డి కొత్తూరు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో చిత్రయూనిట్‌ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరికథ సినిమాలో నటించిన వారంతా కొత్తవారేనని, మహబూబ్‌నగర్‌, మక్తల్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసినట్లు వివరించారు. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కుటుంబ అనుబంధాలు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు. ఇందులో కిరణ్‌, రంజిత్‌, అఖిలరామ్‌, కీర్తిరెడ్డి, లావణ్య ప్రధాన పాత్రల్లో నటించగా రంజిత్‌కుమార్‌, అశోక్‌ కడ్లూరి, వివేకానంద నిర్మాతులుగా వ్యవహరించినట్లు తెలిపారు. ఐరావత సినీ కలర్స్‌, అగ్‌మైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉందని, ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఞప్తి చేసింది. నిర్మాత అశోక్‌ కడ్లూరి మాట్లాడుతూ.. వయస్సుతో సంబంధం లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి సందేశంతోపాటు కుటుంబమంతా కలిసి చూసేలా చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. హరికథ సినిమా డిసెంబర్‌ 11న విడుదల అవుతుందని, ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరారు. అదేవిధంగా నటులు కిరణ్‌, కీర్తిరెడ్డి, లావణ్య విలేకరులతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement