నవాబుపేట: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు నీటి తరలింపునకు తీస్తున్న కాల్వ భూములపై గ్రామసభలు జరుగుతున్నాయి. కాగా, శనివారం మండలంలోని కామారంలో ఏర్పాటు చేసిన గ్రామసభను గ్రామస్తులు బహిష్కరించారు. తమ గ్రామంలో 240ఎకరాల 33గుంటల భూమి ప్రాజెక్టు కాల్వలో ముంపునకు గురికాగా.. సంబంధిత అధికారులు సర్వే సరిగ్గా చేయలేదని రైతులు ఆరోపించారు. తమ భూములు సరిగ్గా సర్వే చేసిన అనంతరం గ్రామసభ నిర్వహించాలని ఆందోళన చేశారు. సర్పంచ్ వెంకటేష్, గ్రామస్తుల డిమాండ్ ప్రకారం కాల్వ భూములపై రీ సర్వే చేయాలని.. అప్పుడే గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తామని అధికారులకు సూచించారు. శనివారం సభ ప్రారంభమైన 10నిమిషాల్లోనే గ్రామస్తుల డిమాండ్‌తో నిలిపివేశారు. కాగా, రైతుల పేర్లు భూముల వివరాలు సరిగ్గా లేవని రైతులు ఆరోపించారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే జలదోపిడీ
అచ్చంపేట: సీఎం బహిరంగ సభ సక్సెస్ కావడం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. శనివారం అంబేడ్కర్ ప్రజా భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎన్నికల ముందు ఒక పంపు ఆన్ చేసి రైతులకు ఎకరాకై నా నీరు ఇచ్చారా? పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జిల్లాలో ఒక ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అన్ని ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డికి 2013లో శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా 44వేల క్యూసెక్కులు తీసుకుపోతుంటే అప్పటి సీఎం వైఎస్సార్ మీద గగ్గోలు పెట్టిన కేసీఆర్ ఆయన సీఎం అయిన తర్వాత 88వేల క్యూసెక్కులు పెంచి తీసుకుపోతుంటే ఏమీ చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోనే జలదోపీడి జరిగిందన్నారు. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. ఎన్ని అవంతరాలు ఎదురైనా అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టేలు తెస్తున్నారని చెప్పారు. మద్దిమడుగు వంతెన కోసం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు లేఖలు ఇచ్చారని చెప్పారు. డీఎల్‌ఐ కోసం 2016లో బీఆర్‌ఎస్ జీవో నెంబర్ 105 ఇచ్చారని, గువ్వల బాలరాజు రైతులను బెదిరించి ఉత్తుత్తి చెక్కులిచ్చి భయపెట్టి కాల్వ తవ్వించారని విమర్శించారు. త్వరలోనే పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ద్వారా నీళ్లిస్తామని, నీళ్లు ఇవ్వకపోతే మేమెవరం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం, ఖాదర్, రాజ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కాశీ–తమిళ సంఘం కార్యక్రమం వీక్షణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వారణాసీలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ చేతుల మీదుగా శనివారం కాశీ–తమిళ సంఘం కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు, విద్యార్థులు అధ్యాపకులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో చంద్రకిరణ్, ప్రవీణ, మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
నేడు యోగా క్రీడాకారులు రిపోర్టు చేయాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో ఆదివారం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి యోగా చాంపియన్‌షిప్ పోటీలు ఉంటాయని ఉమ్మడి జిల్లా యోగా క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్‌కుమార్‌గౌడ్, టి.చంద్రశేఖర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే సీనియర్ యోగా క్రీడాకారులు ఉదయం 6 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రిపోర్టు చేయాలని కోరారు. జిల్లా జట్టులో 18–21 ఏళ్ల విభాగంలో జె.పూజ, బి.అంకిత, జి.శ్రావణి, ఎం.పూజిత, జి.శ్వేత, 21–25లో బి.సాగర్, జి.ఆకాష్, బి.స్వప్న, శ్వేత, కావేరి, 25–30లో రాఘవేంద్రగౌడ్, బాలమణి, 35–40లో వెంకటేశ్, శ్రీదేవి, డి.పావని, ఎం.ప్రమీల ఉన్నారని పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ
వృద్ధుడి మృతి
మిడ్జిల్: మండల పరిధిలోని కొత్తపల్లి సమీపంలో జడ్చర్ల–కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నవాబుపేట మండలం కూచూరు గ్రామానికి చెందిన జంగయ్య (55) హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు మిడ్జిల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.


