అవధూత నరసింహ స్వామి మహిమలు అపారం | - | Sakshi
Sakshi News home page

అవధూత నరసింహ స్వామి మహిమలు అపారం

Nov 29 2026 2:41 PM | Updated on Nov 29 2026 2:41 PM

నారాయణపేట: సద్గురు అవధూత నరసింహ స్వామి మహిమలు అపారమని, నిత్యం భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించే భక్తుల కొంగుబంగారంగా ఆయన కొలువై ఉన్నారని స్వకుల సాళి సమాజ్‌ జాతీయ అధ్యక్షుడు బాలాజీ కాంబ్లె అన్నారు. స్వామివారి 135వ సంజీవని సమాధి ఆరాధనోత్సవాలను శనివారం మఠం కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున కాగడహారతితో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పాదుకపూజ, రుద్రాభిషేకం, మహాలంకరణ, కుంకుమార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటలకు భజన పాటలు, మేళతాళాలు, భక్తుల నామస్మరణల మధ్య పల్లకీసేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గురుస్థానం మహోన్నతమైనదని, ప్రతిఒక్కరూ స్వామివారి సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నిస్వార్థ సేవకులకు సన్మానం

సమాజ సేవలో నిస్వార్థంగా సేవలందించిన తొమ్మిది మంది స్వకుల సాళి సమాజ సభ్యులను మఠం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అయ్యప్ప స్వామి ఆలయ గౌరవాధ్యక్షుడు గందె చంద్రకాంత్‌, అధ్యక్షుడు మనోహర్‌ ప్రసాద్‌గౌడ్‌ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో మఠం కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement