అలంపూర్‌కు భక్తిప్రవాహం | - | Sakshi
Sakshi News home page

అలంపూర్‌కు భక్తిప్రవాహం

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు

● కార్తీక పౌర్ణమికి పోటెత్తిన భక్తులు

● జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక చండీహోమాలు

అలంపూర్‌: కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ శక్తిపీఠం అలంపూర్‌ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. భక్తులు స్థానిక తుంగభద్ర పుష్కర ఘాట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక షవర్ల వద్ద, నదీతీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి, శ్రీ జోగుళాంబ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కొందరు ప్రత్యేకంగా ప్రమిదలు తయారు చేసుకుని దీపారాధన చేశారు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, ప్రత్యేక అర్చనలు జరిగాయి. పౌర్ణమిని పురస్కరించుకుని జోగుళాంబ అమ్మవారి ఆలయంలో చండీహోమా లు నిర్వహించారు. భక్తుల రద్దీతో దర్శనాలకు క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ప్ర ముఖుల రాక సందర్భంగా సాధారణ భక్తులకు కొ న్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.ముఖ్యంగా స్వా మివారి ఆలయంలో అభిషేక పూజల వద్ద జాప్యం జరుగుతోందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

భక్తుల రాకతో క్షేత్రంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించా రు. భక్తుల వాహనాలను స్థానిక కోర్టు సమీపంలోని ఖాళీ స్థలంలో పార్కింగ్‌ చేయించి, అక్కడి నుంచి కాలినడకన ఆలయాలకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహ న సదుపాయం కల్పించారు. క్యూలైన్లలో రద్దీని పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు అలంపూర్‌ చౌరస్తా నుంచి క్షేత్రానికి చేరుకునేందుకు సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో పలువురు ప్రైవేటు వాహ నాలను ఆశ్రయించారు. దూర ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన భక్తులతో ప్రధాన రహదారులపై రద్దీ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement