అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

ధన్వాడ: అనుమానాస్పపద స్థితిలో మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని గోటూర్‌ మూలతండాలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హన్వడ మండలంలోని పిల్లిగుండ్లతండాకు చెందిన పాత్లావత్‌ మౌనిక(22)కు మండలంలోని గోటూర్‌ మూలతండాకు చెందిన బాలునాయక్‌కు రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఏడాది పాప ఉంది. అత్తగారింట్లో ఉంటున్న మౌనిక సోమవారం ఇంట్లో అందరూ పొలం పనులకు వెళ్లగా.. ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతిచెందినట్లు తెలుస్తుంది. 10:40 గంటల సమయంలో గ్రామంలోని పిల్లలు ఇంటికి వెళ్లి చూడగా.. మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే మౌనిక తల్లి బుజ్జిబాయి మాత్రం తన కూతురిని అత్త కమలమ్మ, మామ కొండియానాయక్‌ హత్యచేశారని ఆరోపిస్తుంది. కొంత కాలంగా ప్రతిరోజూ ఇంట్లో భర్త, అత్తమామలతో గొడవలు జరుగుతూనే ఉన్నాయని తన కూతురు ఆదివారం ఫోన్‌ చేసి.. తనను చంపేస్తారు అమ్మ నేను బతికి ఉండకపోవచ్చని బాధపడినట్లు తల్లిదండ్రుతు తెలిపారు. భర్త మూడు రోజుల నుంచి ఇంటికి రాలేదని.. కూలీ పనిచేసేందుకు వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. అంత ప్లాన్‌ ప్రకారం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ కృష్ణంరాజు తెలిపారు.

కుక్కల దాడిలోనలుగురికి గాయాలు

గద్వాల క్రైం: వీధి కుక్కల దాడిలో నలుగురు గాయపడిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. చింతలపేటకాలనీకి చెందిన పరుశ, నరసింహా మరో ఇద్దరు కలసి తెల్లవారుజామున బయటకు వచ్చారు. అట్టుగా వెళ్తున్న వీధికుక్కలు వారిపై అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement