మన్యంకొండలో వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం | - | Sakshi
Sakshi News home page

మన్యంకొండలో వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సంప్రదాయబద్ధంగా అలంకరించిన పల్లకిలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పుష్పాలు, ఆభరణాలతో అలంకరించిన స్వామి దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకను తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు పలువురు భక్తులు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement