డిసెంబర్‌ 29న చలో హైదరాబాద్‌ రైతాంగ గర్జన | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 29న చలో హైదరాబాద్‌ రైతాంగ గర్జన

Nov 25 2026 3:48 AM | Updated on Nov 25 2026 3:48 AM

నారాయణపేట: రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణ చర్యలు చేపట్టాలని ఏఐయుకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. రాము డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్‌ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో డిసెంబర్‌ 29న హైదరాబాద్‌లో చేపట్టనున్న ‘చలో హైదరాబాద్‌ రైతాంగ ప్రజా గర్జన’ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, కరువు పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పరిహారం అందించాలని కోరారు. పంటల బీమా అమలు, రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కొత్త పంట రుణాల మంజూరు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రజా గర్జనకు నారాయణపేట జిల్లా నుంచి రైతులు, కౌలు రైతులు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు యాదగిరి, చెన్నప్ప, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement