మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 70వ రాష్ట్రస్థాయి అండర్–19 హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ మంగళవారం ఘనంగా ముగిసింది. బాలికల విభాగంలో అతిథ్య ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు అద్వితీయమైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలిచింది. టోర్నీలో మొదటి నుంచి మెరుగైన ప్రతిభ కనబబరిచిన బాలికల జట్టు ఫైనల్‌లో కూడా అదే స్థాయిలో రాణించి చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. బాలుర విభాగంలో జిల్లా జట్టు ఫైనల్లో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది.
– బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ హైస్కూల్ మైదానంలో ఉత్కంఠంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు 12–08 గోల్స్ తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. బాలుర విభాగం ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్ జట్టు 14–07 గోల్స్ తేడాతో మహబూబ్‌నగర్‌పై గెలుపొందింది. బాలుర, బాలికల మూడోస్థానంలో కరీంనగర్, ఆదిలాబాద్ జట్లు నిలిచాయి. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచుల్లో మహబూబ్‌నగర్ 11–09 గోల్స్ తేడాతో కరీంనగర్‌పై, వరంగల్ జట్టు 16–5 గోల్స్ తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందాయి. బాలికల విభాగం సెమీఫైనల్ మ్యాచుల్లో మహబూబ్‌నగర్ 9–3 గోల్స్ తేడాతో వరంగల్ జట్టుపై, కరీంనగర్ 11–07 గోల్స్ తేడాతో ఆదిలాబాద్ జట్లపై విజయాలు నమోదు చేసుకున్నాయి. బాలికల విభాగంలో ఆదిలాబాద్, బాలుర విభాగంలో కరీంనగర్ మూడోస్థానంలో నిలిచాయి.
విజేత జట్లకు ట్రోఫీల ప్రదానం
రాష్ట్రస్థాయి అండర్–19 హ్యాండ్‌బాల్ టోర్నీ ముగింపు వేడుకల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ శారీరక, మానసిక, సామాజిక వికాసానికి ఎంతో అవసరమని అన్నారు. మంచి ఫెట్‌నెస్ కోసం క్రీడల్లో పాల్గొనాలని కోరారు. రానున్న జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఈఎంఆర్‌ఎస్ రిటైర్డ్ స్పోర్ట్స్ ఆఫీసర్ రమేష్‌కుమార్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములను సామనంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని కోరారు. ఓడినవారు నిరాశచెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. అనంతరం విన్నర్, రన్నరప్, థర్డ్‌ప్లేస్ జట్లకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో హ్యాండ్‌బాల్ టోర్నీ రాష్ట్ర పరిశీలకులు రఫత్ ఉమర్, జి.శ్రీను, మహబూబ్‌నగర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ శాంత, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్, రజనికాంత్‌రెడ్డి, ఎండి.జియావుద్దీన్, బాల్‌రాజు, రవికుమార్, శంకర్, అహ్మద్ హుస్సేన్, ప్రదీప్‌కుమార్, ముహిబుర్ రహెమాన్, సర్ఫరాజ్‌అలీ, అర్చన, నర్సింహ, రంజిత్‌కుమార్, ప్రణయ్, రియాజ్, చంద్రకాంత్ పాల్గొన్నారు.
బాలుర విభాగంలో విజేతగా వరంగల్
రజతంతో సరిపెట్టుకున్న పాలమూరు బాలుర జట్టు
బాలికల విభాగంలో కరీంనగర్‌కు
రెండోస్థానం
ముగిసిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–19 హ్యాండ్‌బాల్ టోర్నీ


