షార్ట్‌సర్క్యూట్‌తో నగదు, నగలు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో నగదు, నగలు దగ్ధం

Sep 1 2026 1:25 AM | Updated on Sep 1 2026 1:25 AM

రూ. 6 లక్షల నగదు బూడిద

రాజాపూర్‌: మండలంలోని తిర్మలాపూర్‌లో సోమవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓ కుటుంబం దాచుకున్న నగదు, బంగారం, వెండి వస్తులతోపాటు తిండిగింజలు ఆహుతయ్యాయి. తిర్మలాపూర్‌కు చెందిన అజ్జమోని పార్వతమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో పాత గుడిసెను తొలగించి ఆ స్థలంలోనే నూతనంగా నిర్మించుకుంటున్నారు. ఇల్లు నిర్మాణం పనులు మొదలుపెట్టడంతో గ్రామంలోనే ఉన్న ముదిరాజ్‌ భవనంలో ఉంటున్నారు. ప్రమాదవశాత్తు సోమవారం షార్ట్‌ర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగాయి. ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు నుంచి తెచ్చుకున్న రూ.6లక్షల నగదు, బంగారు, వెండి వస్తువులు, బియ్యం బస్తాలతోపాటు ఇంట్లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామస్తులు ఫైర్‌ ఇంజిన్‌కు సమాచారం ఇవ్వడంతో ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని వస్తువులతోపాటు నగదు కాలిపోయాయి. ఇల్లు నిర్మించుకుంటున్న సమయంలో భగవంతుడు మాకీ పరీక్ష ఎందుకు పెట్టాడోనంటూ బాధిత కుటుంబ సభ్యులు రోధించారు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా భరోసా కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement