181కు సమాచారం.. మహిళకు రక్షణ | - | Sakshi
Sakshi News home page

181కు సమాచారం.. మహిళకు రక్షణ

Sep 1 2026 1:25 AM | Updated on Sep 1 2026 1:25 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మహ బూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ పరిధి లోని షాషాబ్‌గుట్ట చౌరస్తా సమీపంలో ఓ పాఠశాల వద్ద గుర్తుతెలియ ని మహిళ ఉన్నట్లు 181 హె ల్ప్‌లైన్‌ ద్వారా వన్‌స్టాప్‌ సెంటర్‌కు సమా చారం అందింది. వెంటనే మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం ఆదేశాల మేరకు వన్‌స్టాప్‌ సెంటర్‌ సిబ్బంది, టూటౌన్‌ పోలీసు ల సహకారంతో మహిళను రక్షించారు. విచారణలో ఆమె తనపేరు ఆశ ఆస్మిన్‌, తల్లి పేరు సర్వర్‌ సుల్తానా బేగం, తండ్రి పేరు అబ్దుల్‌ రహీంగా తెలిపింది. తాను శ్రీనివాస కాలనీ, జడ్చర్లకు చెందినట్లు పేర్కొంది. ప్రస్తు తం ఆమె మతిస్థిమితం సరిగ్గా లేని పరిస్థితిలో ఉండడంతో జడ్చర్లలోని సత్యేశ్వర ఆశ్రమంలో చేర్పించినట్లు వన్‌స్టాప్‌ సిబ్బంది తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, ఆచూకీ తెలిసినవారు వన్‌స్టాప్‌ సెంటర్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు. మహిళను సురక్షితంగా సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

చిరుతదాడిలో

కోడెదూడ మృతి

గండేడ్‌: కోడెదూడపై చిరుతదాడి మరోసారి కలకలం రేపింది. పూర్తి వివరాలు.. మండల పరిధిలోని కొండాపూర్‌ గ్రామానికి చెందిన చెన్నారం వెంకటయ్య మన్సూర్‌పల్లి బొందెగట్టు ప్రాంతంలో ఉన్న పొలంలోని పశువుల పాకలో ఆదివారం పశువులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా కోడెదూడ పాకలో కనిపించ లేదు. చుట్టుపక్కగా వెతకగా కొద్ది దూరంలో చిరుతదాడిలో మృతి చెందినట్లు బాధిత రైతు తెలిపారు. దూడ విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందన్నాడు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత రైతుకు పరిహారం అందించ నున్నట్లు మహమ్మదాబాద్‌ రేంజర్‌ అబ్దుల్‌హై తెలిపారు.

మానవ హక్కుల

పరిరక్షణకు కృషి

వనపర్తి విద్యావిభాగం: అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్‌ సతీ ష్‌యాదవ్‌కు మ రో కీలక బాధ్యత దక్కింది. ఇంటర్నేషనల్‌ హ్యూ మన్‌ రైట్‌ ఆర్గనైజేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అఫ్జల్‌ నియామక ఉత్తర్వులు అందజేశా రు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఎండీ అఫ్జల్‌ చేతుల మీదుగా డాక్టర్‌ సతీష్‌యాదవ్‌ నియామక పత్రం అందుకున్నారు. తొలి రెండు నెలల పా టు రంగారెడ్డి జిల్లా బాధ్యతలను నిర్వహించనున్న ఆయనకు అనంతరం రాష్ట్ర స్థాయి పూర్తి బాధ్యతలు అప్పగించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సతీష్‌ యాదవ్‌ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అఫ్జల్‌తో పాటు జాతీయ అధ్యక్షుడు, సంస్థ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ, పేద, పీడిత వర్గాల సంక్షేమం కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తానన్నారు. అలాగే అఖిలపక్ష ఐక్యవేదికను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు త్వరలో అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించనున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్‌ ఆర్గనైజేషన్‌ను కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement