గ్రామసభను బహిష్కరించిన రైతులు అంబేడ్కర్ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ శిరీష, ఉపసర్పంచ్ సీతారాంరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్, సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోయే రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. భూములు ముంపునకు గురికాకుండా రిజర్వాయర్‌ను మరో ప్రాంతంలో నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రైతులకు నష్టం ఉండదని పేర్కొన్నారు. భూ సేకరణకు ముందు రైతుల అభ్యంతరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరారు.


