మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని బస్ డిపోను మంగళవారం సాయంత్రం ఆర్‌ఎం సంతోష్‌కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటుచేసిన డీజిల్ ట్యాంకుకు పరిశీలించారు. అలాగే మహబూబ్‌నగర్ డిపోలోని బస్సుల కండీషన్‌పై క్షుణ్ణంగా ఆరా తీశారు. 15 ఏళ్లు పైబడి నడిచిన బస్సులు ఏమైనా ఉంటే వెంటనే స్క్రాప్‌నకు తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం (మెయింటెనెన్స్) జగన్, డిపో మేనేజర్ కె.అశోక్ కుమార్, గ్యారేజీ ఏఈ మృత్యుంజయరాములు తదితరులు పాల్గొన్నారు.


