రేపు జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

రేపు జాబ్‌మేళా

Jul 29 2026 1:16 AM | Updated on Jul 29 2026 1:16 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాలుగు కంపెనీల్లో 100 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయ ఫెర్టిలైజర్స్‌, అమర్‌రాజ, అపోలో ఫార్మసీ, మెచ్‌డీఎఫ్‌సీ బీమా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ఇతర వివరాల కోసం 89193 80410 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన

సేవలే లక్ష్యం: ఎస్పీ

దేవరకద్ర: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే జిల్లా పోలీసుశాఖ లక్ష్యమని.. నేరాల నియంత్రణకు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మంగళవారం దేవరకద్ర పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిసరాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు విధానం, దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరుపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతాయుతంగా స్వీకరించి.. చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడం ద్వారా పోలీసుశాఖపై మరింత నమ్మకాన్ని పెంచుతుందన్నారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తూ.. నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని.. ప్రతి రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ శాఖ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తులో వేగం పెంచి, బాధితులకు త్వరగా న్యాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం సిబ్బందికి శాఖాపరమైన అవసరాలు, విధుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఎస్పీ తెలుసుకున్నారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి ఉన్నారు.

గురు పూర్ణిమ

బ్రహ్మోత్సవాలు ప్రారంభం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లాకేంద్రం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని శ్రీద్వారకామాయి బాబా మందిరంలో గురు పూర్ణిమ మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అఖండ దీపారాధన, గణపతిపూజ, స్వామివారికి విశేషంగా అభిషేక పూజ, ప్రధాన కలశపూజ, మహా మంగళహార తి నిర్వహించారు. బుధవారం అష్టోత్తర శతక్షీర కుంభాభిషేకం, సామూహిక సాయి వ్రతాలు, ప్రదోషకాల పూజ, సంధ్యాహారతి, పల్లకీసేవ, 30వ తేదీన మహామంగళహారతి, సకల దేవతా సహితి మత్యుంజయ హోమం పూజలు ఉంటాయని ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement