అన్నారం తండాలో విషాదఛాయలు | - | Sakshi
Sakshi News home page

అన్నారం తండాలో విషాదఛాయలు

Feb 26 2026 8:59 AM | Updated on Feb 26 2026 8:59 AM

అన్నారం తండాలో విషాదఛాయలు

అన్నారం తండాలో విషాదఛాయలు

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

పాన్‌గల్‌: బాసర త్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థిని వసంత బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో తండాలో విషాదఛాయాలు అలుముకున్నాయి. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలోని అన్నారంతండాకు చెందిన చిట్టెమ్మ, లోక్యానాయక్‌లకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె ఇంటర్‌ ద్వీతీయ సంవత్సరం, ద్వితీయ కుమార్తె వసంత బాసర త్రిపుల్‌ ఐటీ చదువుతుంది. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలో త్రిపుల్‌ ఐటీ చదువుతున్న వసంత బాసరలోనే ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పిల్లల చదువుల కోసమే తాము స్వగ్రామం వదిలి మహారాష్ట్రలోని బారామతిలో 20 ఏళ్లుగా కూలీ పనులు చేసుకుంటున్నామని వాపోయారు. ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement