చరిత్రలో ప్రధాన ఘట్టం
ఎమర్జెన్సీ దేశ చరిత్రలో జరిగిన ఒక ప్రధాన సంఘటన. ఎమర్జెన్సీ ద్వారా దేశంలోని వ్యక్తులు, సంస్థలు, నాయకులు కూడా ఇబ్బందులుకు గురయ్యారు. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఎమర్జెన్సీ పేరు మీద హక్కులపై నిభంధనలు విధించారు. ఎమర్జెన్సీ ద్వారా దేశం ఎంతో నేర్చుకుంది. కోర్టులు వాటి పరిధిలో పనిచేసి నాయకులకు పరిధి విధించడం గొప్ప విషయం. – మహేష్, ఎంకాం, పీయూ
కోర్టులు నిలువరించాయి
ఎమర్జెన్సీ సమయంలో ప్రశ్నించే వారిని సైతం జైళ్లో పెట్టారు. అప్పుడు కోర్టుల ప్రాధాన్యత ప్రజలకు తెలిసి వచ్చింది. నాయకులు ఇష్టారీతిగా తీసుకునే నిర్ణయాలను కోర్టులు నిలువరించాయి. ఏ నాయకుడు అయిన రాజ్యాంగం పరిధిలో పని చేయాలని, రాజ్యాంగ మూల సూత్రాలను మార్చడానికి వీలులేదని కోర్టులు తేల్చి చెప్పాయి.
– స్నేహాంజలి, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, పీయూ
చరిత్రలో ప్రధాన ఘట్టం


