ఉరేసుకుని యువకుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

Feb 26 2026 8:59 AM | Updated on Feb 26 2026 8:59 AM

ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

వనపర్తి రూరల్‌: ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. వనపర్తి రూరల్‌ ఎస్‌ఐ హృశికేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కీర్యతండాకు చెందిన గణేష్‌ (21) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పాన్‌గల్‌ మండలంలోని అన్నారంతండాకు చెందిన బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకోదేమోనని, ప్రేమ విఫలమవుతుందనే మనస్తాపంతో గణేష్‌ మంగళవారం రాత్రి సమయంలో హైదరాబాద్‌ నుంచి సొంత కీర్యతండాకు వచ్చి ఇంట్లోని బెడ్‌రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి తండ్రి రత్యనాయక్‌ బుధవారం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement