15 లోగా చిన్న నీటి వనరుల గణన పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఏడో చిన్న నీటి వనరుల గణన ఈ నెల 15లోగా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి, తహసీల్దార్లు, ఎంపీడీఓలను కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మందిరంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిన్న నీటి వనరుల గణనలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో కేవలం 20 శాతం గ్రామాల్లో మాత్రమే గణన జరిగిందని, జనవరి 15లోగా వంద శాతం సర్వేను ఆన్‌లైన్‌లో క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు, జీపీఓలు, ఫీల్డ్ అసిస్టెంట్‌లో గణన పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలన్నా రు. మండలంలో సమావేశం నిర్వహించి గణనపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. కాగా.. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో జరిగిన ప్రజావాణికి 90 ఫిర్యాదులు అందాయి.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి
జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్‌నాయక్, జిల్లా అధికారులు, సిబ్బంది రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో తలకు గాయం కాకుండా నివారించి విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. అలా గే నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని సూచించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ నవీన్, జిల్లా రవాణా శాఖ అధికారి రఘు, డీఆర్‌డీఓనరసింహులు, తదితరులు పాల్గొన్నారు.


