మహబూబ్‌నగర్‌కు మహర్దశ
సుమారు 35 కి.మీల
పైపులైన్ మార్పు..
తాగునీటి వ్యవస్థ పటిష్టం కోసం కేటాయించిన నిధులతో మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో 35 కి.మీ.ల మేర పైపులైన్ మార్చనున్నారు. అదేవిధంగా ఒక్కొక్కటి పది లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంకుల (ఓహెచ్‌ఎస్‌ఆర్)ను తొమ్మిది చోట్ల నిర్మించనున్నారు. హనుమాన్‌పురా, కలెక్టరేట్ బంగ్లా సమీపంలో, తిరుమలహిల్స్, ఎనుగొండలోని సాంబ శివాలయం గుట్టపై, పాల్కొండ సంప్‌వెల్ వద్ద, టీచర్స్ కాలనీ పార్కు, మెట్టుగడ్డ, బ్రహ్మన్‌వాడి, బైపాస్ పక్కన నిర్మించేలా డీపీఆర్ రూపొందించారు. వీటన్నింటినీ రింగ్ మెయిన్ పైపులైన్‌తో అనుసంధానం చేయనున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అవతరించిన మహబూబ్‌నగర్ రూపురేఖలు క్రమక్రమంగా మారుతున్నాయి. నగరీకరణతో పాటు నగరంలో పెరుగుతున్న జానాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేసిన క్రమంలో నిధులు వెల్లువెత్తుతున్నాయి. నగర ప్రజల చిరకాల స్వప్నం అయిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి వ్యవస్థ పటిష్టతకు ఎట్టకేలకు అడుగులు పడ్డాయి. సుమారు రూ.824 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆయా నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల పరిపాలనా అనుమతులు మంజూరు చేయగా.. త్వరలో టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టనున్న పనులపై ‘సాక్షి’ కథనం..
కొనసాగుతున్న ఎస్టీపీల నిర్మాణం..
అమృత్–2లో భాగంగా నగరంలో మురుగునీటి శుద్ధీకరణ కోసం ఇదివరకే రూ.276.80 కోట్ల వ్యయంతో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మూడు చోట్ల (పెద్దచెరువు శివారు, పాలమూరు చిన్నచెరువు శివారులోని శ్రీనివాసకాలనీ గుట్ట వద్ద, సారికా టౌన్‌షిప్ వెనుక భాగంలో) ఎస్టీపీల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. యూజీడీ ప్రధాన పైపులైన్ల నుంచి వచ్చిన మురుగునీటిని ఈ ప్లాంట్లకు అనుసంధానం చేసి.. ఇక్కడ శుద్ధి అయిన తర్వాత చెరువులు, కుంటల్లోకి వదలనున్నారు. ఎట్టకేలకు తాగునీటి పటిష్టానికి, యూజీడీ నిర్మాణాలకు అడుగులు పడడం.. మురుగు సమస్యకు పరిష్కారం లభించనుండడంతో నగర ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మౌలిక వసతుల కల్పనకు నిధుల వరద
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, తాగునీటి వ్యవస్థ పటిష్టతకు రూ.824 కోట్లు
ఇదివరకే ప్రతిపాదనలు.. డీపీఆర్‌లు సిద్ధం
ఇటీవలే పరిపాలనా అనుమతులమంజూరు
త్వరలో పట్టాలెక్కనున్న పనులు
మహబూబ్‌నగర్‌కు మహర్దశ
మహబూబ్‌నగర్‌కు మహర్దశ


