బాలికపై అత్యాచారం
మద్దూరు: మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు కోస్గి సీఐ సైదులు సోమవారం తెలిపారు. సీఐ కథనం మేరకు.. దామరగిద్ద మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) మద్దూర్‌లో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. దామరగిద్ద మండలానికి చెందిన బోయిని శ్రీనివాస్ (24) ఈ నెల 10న బాలికకు మాయమాటలు చెప్పి తన ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ఓ కిరాయి రూంలో బాలికపై అత్యాచారం చేసి మరుసటి రోజు మద్దూరు బస్టాండ్‌లో వదిలిపెట్టాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకొని సోమవారం కోస్గి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు మెజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. మహబూబ్‌నగర్ సబ్ జైలుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
చెక్ బౌన్స్ కేసులో ఆరునెలల జైలుశిక్ష
ఖమ్మం లీగల్: మహబూబ్‌నగర్‌కు చెందిన కుమ్మరి శేఖర్‌కు చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించడమే కాక ఫిర్యాదుదారుడికి రూ.7లక్షల పరిహారం చెల్లించాలని ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కాసరగడ్డ దీప సోమవారం తీర్పు చెప్పారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన వరికల వెంకటేశ్వరరావు వద్ద శేఖర్ రెండు దఫాలుగా రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమంలో 2018 డిసెంబర్‌లో రూ.7 లక్షలకు చెక్కు ఇచ్చాడు. కానీ ఆయన ఖాతాలో సరిపడా నగదు లేక చెక్కు తిరస్కరణకు గురైంది. ఈ మేరకు వెంకటేశ్వరరావు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం శేఖర్‌కు జైలుశిక్ష విధించడంతో పాటు ఫిర్యాదికి రూ.7లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
నిందితుడికి 14 రోజుల రిమాండ్


