● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూచించారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో క్షయవ్యాధి నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. సరైన సమయంలో క్షయను గుర్తించడం, సక్రమంగా చికిత్స తీసుకోవడం ద్వారా పూర్తిగా పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుందన్నారు. రెండు వారాలకు పైగా దగ్గు, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్మూలకు అవగాహన కల్పిస్తూ పరీక్షలు చేయడం, ఇంటి సర్వేలు, కాంటాక్ట్ ట్రేసింగ్, పోషణ సహాయం, నిక్షయ్ పథకం అమలు వంటి అంశాలపై దృష్టిసారించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు గుర్తించిన క్షయవ్యాధి కేసులను తప్పనిసరిగా ప్రభుత్వ నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. జిల్లా టీబీ అధికారి అర్జున్, సూపర్‌వైజర్లు, హెల్త్ విజిటర్లు, సిబ్బంది ఉన్నారు.


