విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి

Jul 24 2026 1:15 AM | Updated on Jul 24 2026 1:15 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: రాష్ట్ర వ్యాప్తంగా నేడు(శుక్రవారం) ఇంటర్‌, ఉన్నత విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ నాయకులు కాంపాటి పృథ్వీ, పట్ల మధు, వికాస్‌, మధు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో గురువారం ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి 152సార్లు వివిధ పరీక్షల పేపర్లు లీక్‌ అయ్యాయని, నీట్‌ పేపర్‌ లీకేజీకి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఉక్కుపాదం మోపిని బీజేపీని ఓడించాలన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. నాయకులు నందీశ్వర్‌, గౌతమ్‌, జ్యోతిబసు, మహేష్‌, వంశీ, నవీన్‌, వినోద్‌, జశ్వంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement