ఊరిలోనే ఓటు ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఊరిలోనే ఓటు ఉండాలి

Jul 24 2026 1:15 AM | Updated on Jul 24 2026 1:15 AM

నేను పదిహేను సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నా. అక్కడ సొంత ఇల్లు ఉంది. కానీ, ఏ ఎన్నిక వచ్చినా మా చిన్నగూడూరుకు వచ్చి ఓటు వేయడం ఇష్టం. అందుకోసమే ఇప్పుడు కూడా మా గ్రామంలోనే ఓటు ఉండాలని హైదరాబాద్‌ నుంచి వచ్చి ఎన్యూమరేషన్‌ ఫాం నింపి వెళ్లాను. మా ఓటు మా ఊరిలో ఉంటేనే అందం.

– గాడిపెల్లి యాకయ్య, చిన్నగూడూరు

సొంత ఊరిలో ఓటు వేయడం ఇష్టం

మా సొంత ఊరు బొమ్మకల్లు. మేము హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాం. అయినా ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వస్తుంటాం. ఊరికి రావడం అంటే ఇష్టం. అలాగే ఊరిలో ఓటు వేసేందుకు రావడం అంటే అదో అనుభూతి. కుటుంబ సభ్యులందరికీ గ్రామంలోనే ఓటు ఉండాలని పట్టుబట్టి ఎన్యూమరేషన్‌ ఫారాలు నింపి ఇచ్చాం.

– కేతిరెడ్డి అశ్వినిరెడ్డి, బొమ్మకల్లు, పెద్దవంగర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement