మరిపెడ రూరల్: ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్, డిప్యూటీ సీఈఓ పురుషోత్తం అన్నారు. గురువారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి ఆగస్టు 3న పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతీ ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా నమోదు చేసి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యతతో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌లో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని, ప్రతీ ఇంటిని సందర్శించి అర్హుల వివరాలను నమోదు చేయడంతో పాటు అవసరమైన పత్రాలను సక్రమంగా పరిశీలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరిపెడ ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్ సోములునాయక్, కార్యదర్శి ముజఫర్, సిబ్బంది పాల్గొన్నారు.


