● మాజీ చీఫ్ విప్
దాస్యం వినయ్ భాస్కర్
హన్మకొండ : తెలంగాణలో కాంగ్రెస్ పా ర్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా మూడు వేల ఉద్యోగాలు ఇవ్వలేదని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం హనుమకొండ సుబేదారిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కేటీఆర్ భరోసా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ యాప్‌ను ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు. మాయమాటలతో నిరుద్యోగ యువత ఓట్లు దండుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంచిందని ధ్వజమెత్తారు. దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు కేటీఆర్ నిరుద్యోగ భరోసా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ యాప్ శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని కోరా రు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అబద్ధాల పునాదులపై ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తప్పుతోవ పట్టిస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు ల క్షల ఉద్యోగాలు, నిరుద్యోగ బృతి ఇస్తామ ని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు మర్రి యాదవరెడ్డి, జోరిక రమేశ్, సునీల్, లోహిత, సైదిరెడ్డి, వీరేందర్, శరత్‌శంద్ర, ప్రశాంత్, వీరస్వామి, మనోజ్, రామ్మూర్తి, రజిని, శ్రీధర్, రాజు, చిన్న, వినిల్ రావు పాల్గొన్నారు.


