చిన్నారి అపహరణకు యత్నం | - | Sakshi
Sakshi News home page

చిన్నారి అపహరణకు యత్నం

Jul 23 2026 12:54 AM | Updated on Jul 23 2026 12:54 AM

పట్టుకున్న స్థానికులు

పోలీసులకు అప్పగింత

ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బుధవారం చిన్నారి (పాప) అపహరణకు యత్నం జరిగింది. నందమూరినగర్‌కు చెందిన పుట్ట రాజేందర్‌, భవాని దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భవాని ఏడాదిలోపు చిన్నారిని ఆడిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మంచినీరు కావాలని అడిగాడు. తల్లి ఎమరుపాటుగా ఉందని గ్రహించి ఆ చిన్నారిని అపహరించేందుకు యత్నించాడు. వెంటనే తెరుకున్న భవాని అతడిని వారించి కేకలు వేయగా చుట్టు పక్కల వారు వచ్చి దుండగుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడిని విచారించగా పొంతలేని సమాధానం చెప్పాడు. ఒకసారి ఛత్తీస్‌గఢ్‌ అని, మరోసారి ఒడిశా అని.. తాము ముగ్గురు వ్యక్తులం పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చామని చెప్పడంతో అందరు ఆందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement