హన్మకొండ : విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ డీసీసీ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద రాష్ట అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్. నాగరాజుతో కలిసి మల్లు భట్టి విక్రమార్క ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీకి హఠావో.. దేశ్ కి బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువకులపై కేంద్ర ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించిందని, మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారన్నారు. విద్యార్థులపై పాశవికంగా వ్యవహరించినందుకు నిరసనగా వారికి అండగా ఉండేందుకు బాధ్యతగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికా ర్జున ఖర్గే ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాం రెడ్డి, నాయకులు గుండు సుధారాణి, ఇ.వి.శ్రీనివాస్‌రావు, బత్తిని శ్రీనివాస్, పెరుమాండ్ల రామకృష్ణ, నాయిని లక్ష్మా రెడ్డి, బంక సంపత్ యాదవ్, కరాబు రాజేశ్వర్ రావు, అనిల్, అలువాల కార్తీక్, సతీశ్ పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హనుమకొండ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా


