జనగామ ముందంజ..
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో
ఎవరు ఏ విషయంలో ముందున్నారంటే..
అత్యధిక మొత్తం స్కోరు: జనగామ (49.73)
ఉత్తమ ఓఐఎంఎస్: ములుగు (9.80)
ఉత్తమ రైతుల నమోదు: హనుమకొండ (8.34)
ఉత్తమ భూ ధ్రువీకరణ: వరంగల్ (9.54)
(ఈ ఆరు జిల్లాల్లో)
ఉత్తమ వ్యవసాయ విస్తరణ
అధికారుల హాజరు: హనుమకొండ (6.01)
సాక్షి, వరంగల్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమలు, రైతుల నమోదుతో పాటు డిజిటల్ సేవల పురోగతిని ఏడు కీలక పారామీటర్ల ఆధారంగా అంచనా వేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో జనగామ అత్యుత్తమ పనితీరుతో రాష్ట్రంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హనుమకొండ మూడో స్థానంలో నిలవగా, ములుగు ఎనిమిదో స్థానం సాధించింది. వరంగల్ జిల్లా మాత్రం 16వ స్థానంలో నిలవడం గమనార్హం. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు రాష్ట్ర సగటు కంటే వెనుకబడ్డాయి.జూన్ 30 నాటికి రూపొందించిన నివేదికలో రైతుల నమోదు, రైతు మరణాల నమోదు, క్లెయిమ్‌ల పరిష్కారం, భూ ధ్రువీకరణ, ఫైవ్స్ యాప్ వినియోగం, ఓఐఎంఎస్ అమలు, వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈఓ) హాజరును పరిశీలించి జిల్లాలకు మార్కులు కేటాయించారు.
హనుమకొండకు మూడో స్థానం..
48.80 పాయింట్లతో హనుమకొండ రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. రైతుల నమోదు (8.34), ఓఐఎంఎస్ (9.78), భూ ధ్రువీకరణ (9.19), ఏఈఓ హాజరు (6.01)లో మంచి మార్కులు సాధించింది. అయితే రైతు మరణ క్లెయిమ్‌ల పరిష్కారంలో (1.74) పనితీరు తక్కువగా నమోదైంది.
ములుగు టాప్–10లో చోటు..
46.06 పాయింట్లతో ములుగు రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఓఐఎంఎస్ (9.80), భూ ధ్రువీకరణ (9.53)లో అత్యుత్తమ పనితీరు కనబర్చినా, రైతు మరణాల నమోదు (4.15), క్లెయిమ్‌లు (1.69)లో ఆశించిన పురోగతి కనిపించలేదు.
వరంగల్‌కు మధ్యస్థానం..
43.80 పాయింట్లతో వరంగల్ జిల్లా 16వ స్థానంలో నిలిచింది. రైతుల నమోదు (7.68), భూ ధ్రువీకరణ (9.54), ఓఐఎంఎస్ (8.83)లో మంచి మార్కులు వచ్చినప్పటికీ, రైతు మరణ క్లెయిమ్‌లు (1.67), ఏఈఓ హాజరు (3.68) తక్కువగా ఉండడం ర్యాంకును ప్రభావితం చేసింది.
మహబూబాబాద్ వెనుకంజ..
45.04 పాయింట్లతో మహబూబాబాద్ 13వ స్థానంలో నిలిచింది. రైతుల నమోదు (7.38), ఓఐఎంఎస్ (8.92), ఏఈఓ హాజరు (5.54) సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, రైతు మరణాల నమోదు (4.05), క్లెయిమ్‌లు (1.46), భూ ధ్రువీకరణ (8.83)లో మెరుగుదల అవసరమని నివేదిక సూచిస్తోంది.
జయశంకర్ భూపాలపల్లి పరిస్థితి..
42.36 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతుల నమోదు (6.98), భూ ధ్రువీకరణ (8.82), ఓఐఎంఎస్ (9.27) బాగున్నప్పటికీ, రైతు మరణ క్లెయిమ్‌లు (1.48), ఏఈఓల హాజరు (3.88)లో పని తీరు తక్కువగా నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిజిటల్ సేవలు (ఓఐఎంఎస్,ఫైవ్స్), భూ ధ్రువీకరణలో చాలా జిల్లాలు మెరుగైన పనితీరు కనబర్చాయి. అయితే ‘రైతు మరణ క్లెయిమ్‌ల పరిష్కారం, ఫీల్డ్ స్థా యి పర్యవేక్షణ (ఏఈఓల హాజరు)’ లో అన్ని జిల్లాల్లోనూ తక్కువ మార్కులు రావడం ఆందోళన కలిగించే అంశం. రైతు భరోసా పథకం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే పెండింగ్ నమోదులు, క్లెయిమ్‌ల పరిశీలన వేగం చేయాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
వ్యవసాయ విభాగాల్లో ఏడు కీలక పారామీటర్లలో జిల్లాల పనితీరుపై ప్రభుత్వం ర్యాంకింగ్
హనుమకొండకు మూడో స్థానం.. వరంగల్ 16వ స్థానానికి పరిమితం
జనగామ అన్ని
రంగాల్లో సమతూకం
49.73 పాయింట్లతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన జనగామ జిల్లా దాదాపు అన్ని పారామీటర్లలో సమతూక పనితీరు కనబర్చింది. రైతుల నమోదు (7.79), భూ ధ్రువీకరణ (9.63), ఫైవ్స్ యాప్ (9.61), ఓఐఎంఎస్ (9.09)లో అధిక మార్కులు సాధించింది. రైతు మరణ క్లెయిమ్‌లలో (1.67) మాత్రం ఇంకా మెరుగుదలకు అవకాశం
ఉంది.


