మందుల కొనుగోలుకు వచ్చి మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

మందుల కొనుగోలుకు వచ్చి మృత్యుఒడికి..

Jul 23 2026 12:54 AM | Updated on Jul 23 2026 12:54 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : మందులు కొనుగోలుకు వచ్చిన ఓ వ్యక్తి బైక్‌ ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. టౌన్‌ సీఐ ఎల్‌.రఘుపతి రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని రామన్నపేట కాలనీలో నివాసం ఉండే బంధువులు గుగులోత్‌ వెంకన్న, ఇస్లావత్‌ వీరన్న (55) మంగళవారం రాత్రి ముందుల కొనుగోలుకు ఓ ఆస్పత్రి వద్దకు వచ్చారు. కొనుగోలు అనంతరం ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనదారుడు వెనుక నుంచి వీరన్నను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలుకాగా వెంటనే స్థానికులు, కుటుంబీకులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువు వెంకన్న ఫిర్యాదు మేరకు ప్రమాద ఘటనకు బాధ్యుడైన బయ్యారం మండలం కస్తూరి నగర్‌కు చెందిన బాదావత్‌ నవీన్‌పై టౌన్‌ ఎస్సై బషీరుద్దీన్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు.

బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

మానుకోటలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement