సాక్షి, మహబూబాబాద్: ప్రపంచీకరణ అందిపుచ్చుకున్న శాస్త్ర విజ్ఞానానికి అనుగుణంగా పనిచేస్తేనే ఏ రంగమైన, ఏ శాఖ అయినా మనుగడ సాధిస్తుందనేది సత్యం. ఈ విధానాన్ని అమలు చేసే పనిలో ఎస్పీ శబరీష్ వినూత్న రీతిలో ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా జిల్లా పోలీస్‌శాఖలో హెడ్ కానిస్టేబుల్(హెచ్‌సీ), ఏఎస్సైలు, మూడు దశాబ్ధాల సర్వీస్ ఉన్నవారికి ప్రత్యేక ఓరియంటేషన్ తరగతులు నిర్వహించి వారు చేసింది, చేయాల్సింది, పోలీస్‌శాఖలో వారి అనుభవాల ప్రాధాన్యంను వివరించారు. సుధీర్ఘ సర్వీస్‌లో సంపాదించిన అనుభవం పోలీస్‌శాఖకు, జూనియర్ సిబ్బందికి ఆదర్శంగా ఉండాలంటూనే.. మరో వైపు సర్వీస్ దగ్గర పడుతుంది.. జాగ్రత్తగా ఉండాలి.. పోలీస్‌శాఖను అప్రతిష్ట పాలు చేయొద్దని, శభాష్ పోలీస్ అనిపించుకునేలా పని చేయాలని ఉపదేశించారు.
గత అనుభవాలను వివరిస్తూ..
గతంలో పోలీస్ అనగానే ఏదో తప్పు చేసిన వారిని శిక్షించడానికి వచ్చారనే నానుడి ఉంది. అప్పుడు చే సిన ఇంటరాగేషన్ వేరు.. శాస్త్ర పరిజ్ఞానం అంతగా లేకపోయినా నేరాలను చేధించేవారు. గతంలో జిల్లా ఆఫీసర్‌కు మారుమూల గ్రామాలు తెలియ దు. అక్కడినుంచి వచ్చి నేరుగా అధికారికి తమ స మస్యలను చెప్పుకోవడం అంతగా తెలియదు. అ ప్పుడు కొందరు అధికారులు, ఉద్యోగులు ఏం చేసినా బయట ప్రపంచానికి సంవత్సరాల తరబడి తెలిసేది కాదు.. ప్రజలతో సంబంధాలు కూడా తక్కువగానే ఉండేవి.. ఏ పరిజ్ఞానం లేకపోయినా నేరస్తులను పట్టుకొని శిక్షలు పడేలా చేసేవారు.
ప్రస్తుత పరిస్థితి..
ప్రస్తుతం ప్రతీఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. ప్రపంచమే అరచేతిలోకి వస్తుంది. మీడియా ప్రాధాన్యం పెరిగింది. సోషల్ మీడియా వేగం పెంచింది. ఈ పరిస్థితిలో ప్రతీ కదలిక సమాజానికి తెలిసి పోతుంది. తప్పు చేస్తే అబాసు పాలు అవుతారు. ప్రజల్లో చట్టాలపై అవగాహన పెరిగింది. ప్రశ్నించేవారు ఎక్కువ అయ్యారు. ఎక్కడ తప్పటడుగులు వేసినా దొరికి పోయే ప్రమాదం ఉంది. ప్రతీ ఒక్క రు జిల్లా ఎస్పీనే కాదు.. డీజీపీ వంటి పెద్ద ఆఫీసర్లను కలిసే సౌకర్యం ఉంది. ఈ పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఐటీ, ఇతర సాంకేతిక పరి జ్ఞానం ఉన్నా నేరాలను చేధించలేక పోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే మనతోపాటు నేరస్తుల్లో కూడా పరిణతి చెందినట్లు స్పష్టం అవుతుంది. అందుకే ప్రజల్లో మంచి పేరు, మమేకం అవసరం.
ప్రజల్లో చర్చగా మారిన ఓరియంటేషన్..
పోలీస్‌శాఖకు మంచి పేరు తేవాలంటే ముప్పై సంవత్సరాలుగా శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల పాత్ర కీలకమని ఎస్పీ నిర్వహించిన ఓరియంటేషన్ తరగతులపై జిల్లా పోలీస్‌శాఖలోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చగా మారింది. కానిస్టేబుళ్లుగా నియామకం అయినప్పటి నుంచి స్థానికంగా (జిల్లాలో) పనిచేస్తున్నారు. వీరికి తెలియని ఊరు ఉండదు. ప్రజాప్రతినిధులు, నేరస్తులు, ప్రాంతాల వారీగా సమస్యలు తెలుసు. ప్రస్తుతం స్టేషన్లల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్స్, కొత్తగా వచ్చిన ఎస్సైలు చిన్న వారు, అనుభవం లేని వారు. వీరికి సలహాలు, సూచనలు ఇస్తూ శాఖకు మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాల్సింది హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎౖస్సైలు. రూ.500లకు, రూ.1000కి ఆశపడితే సర్వీస్‌లో చేసిన మంచి పోతుంది. నమ్మకం పోతుందని ఎస్పీ హెచ్చరించినట్లు ప్రచారం. మారిన చట్టాలు, కేసుల పరిశోధన, ప్రజలతో మమేకం, కంప్యూటర్, సీసీటీఎన్‌ఎస్‌పై పరిజ్ఞానం అవసరమని పోలీస్‌శాఖలో మార్పు కోసం ఎస్పీ చేసిన ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది.
మెరుగైన సేవలు అందించే ప్రయత్నం
ప్రతీ ఉద్యోగి తమ బాధ్యతలు ఎరిగి పనిచేయాలి. మారిన పోలీసింగ్ వ్యవస్థపై అవగాహన ఉండాలి. అదేవిధంగా శాఖలో పనిచేసిన అనుభవాలు కింది తరాలకు అందించాలి. అప్పుడే నేర రహిత సమాజ నిర్మాణానికి చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. పోలీస్‌శాఖలో మూడు దశాబ్ధాలుగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలు, సలహాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతాయనే ఉద్దేశంతోనే ఓరియంటేషన్ తరగతులు నిర్వహించాం.
– శబరీష్, ఎస్పీ
●
సర్వీస్ దగ్గర పడుతుంది.. శాఖకు చెడ్డపేరు తేవద్దు
ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేయాలి
హెచ్‌సీ, ఏఎస్సైలకు ఎస్పీ శబరీష్
ఓరియంటేషన్ తరగతులు
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా బాస్


