వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

Jul 23 2026 1:18 AM | Updated on Jul 23 2026 1:18 AM

అభినందించిన ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌

మహబూబాబాద్‌ రూరల్‌: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించి వెంటనే కాపాడారు. దీంతో ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ అంజలి, ఎస్సై సుదర్శన్‌, బ్లూ కోల్ట్స్‌ సిబ్బందిని అభినందించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా కేంద్రంలోని రైల్వే ట్రాక్‌ వద్ద బుధవారం తెల్లవారు జామున సుమారు 2:44 గంటలకు ఓ యువకుడు ఆత్మహత్మకు పాల్పడుతున్నట్లు డీజీ కంట్రోల్‌ రూమ్‌ నుంచి మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ అంజలికి సమాచారం అందింది. స్పందించిన సీఐ అంజలి వెంటనే వైర్‌ లెస్‌ సెట్‌ ద్వారా నైట్‌ పెట్రోలింగ్‌ పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎస్సై సుదర్శన్‌, బ్లూ కోల్ట్స్‌ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి రైల్వే ట్రాక్‌ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఓసీ క్లబ్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడుకుని ఉన్న యువకుడిని గుర్తించి చాకచక్యంగా పట్టుకుని సురక్షిత్తంగా బయటకు తీసుకువచ్చారు. ఈ విషయంపై రూరల్‌ సీఐ అంజలి మాట్లాడుతూ రక్షించబడిన యువకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన షేక్‌ వసీమ్‌గా గుర్తించామని, కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపాడన్నారు. వసీమ్‌ను టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్‌ నిర్వహించామని, తల్లిదండ్రులకు సమాచారం అందించి వారి సమక్షంలో అప్పగించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement