కాంగ్రెస్ వాళ్లకే యూరియా..
వ్యవసాయంలో వ్యత్యాసం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ముందుగా యూరియా ఇస్తున్నారు. వాళ్ల పంటనే ముందుగా కొంటున్నారు. వర్షం వచ్చి వడ్లు తడుస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. అంతా అవినీతి, అక్రమాలకు నిలయంగా కాంగ్రెస్ పాలన నిలుస్తోంది.
– సుబ్బారావు, రైతు, ఖానాపురం, వరంగల్
పండించిన పంటను ఎప్పుడు కొంటారు? పెట్టిన పెట్టుబడి ఎప్పుడు చేతికందుతుందని రైతులు కల్లాల కాడ.. మక్కల అమ్మకానికి నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. కేసీఆర్ పాలనలో రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.5 వేలు ఇవ్వగా, ఇప్పుడు ఒక ఎకరానికి మాత్రమే రూ.6 వేలు వేస్తున్నారు. – ఊకంటి రవి, రైతు, దుగ్గొండి
రైతుబంధు పడట్లేదు..
యాక్సిడెంట్‌లో కాలు కోల్పోయినా కూడా కేటీఆర్‌ను చూసే ందుకు, బీఆర్‌ఎస్‌పై మక్కువతో ఒక్క కాలితో నేలపై అతి కష్టమ్మీద సదస్సుకు వచ్చా. నాకు మూడెకరాల భూమి ఉంటే రైతుబంధు ఇస్తలేరు. కేసీఆర్ సారే సీఎం కావాలి. ఈసారి ఓటు వృథా చేసుకోం. – ఎండీ, మక్బూల్, రైతు, కొత్తపేట, హనుమకొండ
●


