నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. కరోనా సమయంలో రోగులకు ఆక్సిజన్ అందించేలా ఏర్పాటు చేసిన ప్లాంట్ ఆ తర్వాత వినియోగం లేకపోవడంతో మూలనపడింది.
పీఎం కేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు..
పీఎం కేర్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్లాంట్‌ను వినియోగించకపోవడంతో మిషన్లు తుప్పు పడుతున్నాయి. 330 పడకలుగా ఉన్న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతీరోజు సుమారు వెయ్యికిపైగా రోగులు వస్తుంటారు. దీంతో ఎమర్జెన్సీ సమయాల్లో ఆక్సిజన్ సిలిండర్లు అవసరమవుతున్నాయి. కాగా, ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు, ప్రజలు కోరుతున్నారు.
కొనుగోలు చేసి..
ఆక్సిజన్ ప్లాంట్ వినియోగంలో లేకపోవడంతో బయట నుంచి ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేసి రోగుల చికిత్స నిమిత్తం వినియోగిస్తున్నారు. దీంతో ప్రైవేట్ సంస్థలకు బిల్లులు చెల్లిస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి యంత్రాలు అమర్చారు. ప్లాంట్ వినియోగించకపోవడంతో యంత్రాలు, పరికరాలు పాడవుతాయి. కాగా, ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
వినియోగంలో లేకపోవడంతో..
జిల్లా ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ నిరుపయోగంగా మారడంతో ఆవరణలో పిచ్చిమొక్కలు, గడ్డి పెరుగుతోంది. కాగా, పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకు వస్తారా లేక ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్
కరోనా తర్వాత నిర్వహణ బంద్
బయట నుంచి ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలు
గడ్డి, పిచ్చిమొక్కలతో ప్లాంట్ ఆవరణ


