రేగొండ: ఆర్థిక కారణాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జోగయ్యపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర సరోజన (55) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితులతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


