ఖిలా వరంగల్ : అన్నదాతకు భరోసా కల్పించేందు కు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే రైతు ముగింట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ద్వారా వరంగల్ జిల్లాలోని ఊరూరా చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్య వసాయశాఖ ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి 9 వర కు రైతు వారోత్సవాలు నిర్వహించనుంది. వానా కాలం సాగుకు అన్నదాతలను జాగృతం చేసేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రకటించింది.
అవగాహన సదస్సులు ఇలా..
4న నేలఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, సన్న వరి ర కాల సాగు, 5న ఉద్యాన పంటల సాగు, ఆయిల్‌పా మ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంట ల సాగు, 6న బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పంట పంట రుణాలు, 7న వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం కుసుమ్ వ్యవసాయ యాంత్రీకరణ డ్రోన్స్, 8న పశుసంవర్థక శా ఖ, పాడి పరిశ్రమ– పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశు సంరక్షణ, మత్స్యశాఖ–చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నియంత్రణ, అధికోత్పత్తికి చర్యలు, 9న నీటిపారుదల శాఖ–చెరువుల్లో కంపచెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత కార్యక్రమాలు జరగనున్నాయి.
మట్టి నమూనా ఫలితాలు..
జిల్లాలో మొదటి విడతగా భూసార పరీక్షలు చేశా రు. గత మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు నెల రోజుల పాటు జిల్లాలోని ప్రతీ రెవెన్యూ గ్రామం నుంచి పది మట్టి నమూనాలను సేకరించారు. వీటి ని వరంగల్ ములుగు రోడ్డులోనిభూసార పరీక్ష కేంద్రం కార్యాలయానికి పంపించారు. నిర్వహించిన మట్టి శాంపిల్ ఫలితాలను వ్యవసాయాధికారి చేతికి రానున్నాయి. రైతు వారోత్సవాల్లో మట్టి పరీక్ష ఫలితాలు సంబంధిత రైతులకు వెల్లడించనున్నారు.
5 నుంచి 7వతేదీ వరకు మెగా రైతు మేళా..
హనుమకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల గ్రౌండ్‌లో ఈ నెల 5,6,7 తేదీల్లో ఉమ్మడి జిల్లా మెగా రైతు మేళా జరగనుంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లలో అధి కారులు నిమగ్నమయ్యాయి. ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు 5వేల మంది రైతులు హాజరుకానున్నారు. భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. ఈరైతు మే ళాకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జి ల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్య వసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
4 నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు
ఆర్ట్స్ కళాశాల మైదానంలో 5,6,7వ తేదీల్లో మెగా రైతుమేళా
ఉమ్మడి జిల్లా నుంచి ప్రతీ రోజు 5వేల మంది రైతుల రాక
ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం


