● 78 శాతం మంది అభ్యర్థుల హాజరు
విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ ఎక్సలెన్స్) ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు గాను టీజీఆర్‌జేసీ సెట్ –2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీలో 35 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్‌జిల్లాలో 8,357మంది అభ్యర్థులకు గాను 6,415 మంది పరీక్షకు హాజరుకాగా 1,842మంది గైర్హాజరయ్యారని టీజీఆర్‌జేిసీ సెట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ కె. ఇంధుమతి తెలిపారు. హనుమకొండ జల్లా డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్, ఏసీజీఈ భువనేశ్వర్, కోఆర్డినేటర్ ఇంధుమతి, డీఆర్‌ఓ పలు కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరు పరిశీలించారు.
పిడుగుపాటుకు
కాడెడ్లు మృత్యువాత
కేసముద్రం: పిడుగుపాటుతో మూడు కాడెడ్లు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు బి.సమయ్య తన మూడు కాడెడ్లు, ఓ గేదెను వ్యవసాయ భూమి వద్ద చెట్టు కింద కట్టేశాడు. ఈ క్రమంలో సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా ఆ పశువులు ఉన్నచోట పిడుగు పడడంతో మూడు కాడెడ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న బాధిత రైతు కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నాడు.
వైద్యం వికటించి బాలుడి మృతి!
దంతాలపల్లి: ఆర్‌ఎంపీ వైద్యం వికటించి బా లుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వారి కథనం ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఏడెల్లి అశోక్–ఊర్మిల దంపతులకు సుశాంత్‌త్, మల్లికార్జున్ కుమారులు ఉన్నారు. అశోక్ బైకు మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. పెద్ద కుమారుడు సుశాంత్ (15) మండల కేంద్రంలోని ఎ ంజేపీ పాఠశాలలో 9 వతరగతి పూర్తిచేశాడు. ఆదివారం కడుపు నొప్పి రావడంతో స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి దగ్గర చూపించారు. వైద్యం అనంతరం బాలుడు మరింత అస్వస్థత కు గురికావడంతో తొర్రూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమించిందని చెప్పడంతో వరంగల్ ఎంజీఎం తరలి స్తుండగా చని పోయాడు. ఆ ర్‌ఎంపీ వైద్యంతోనే తమ కు మారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు.


