గుంజేడు జాతరను అభివృద్ధి చేస్తా | - | Sakshi
Sakshi News home page

గుంజేడు జాతరను అభివృద్ధి చేస్తా

Feb 27 2026 4:25 AM | Updated on Feb 27 2026 4:25 AM

గుంజేడు జాతరను అభివృద్ధి చేస్తా

గుంజేడు జాతరను అభివృద్ధి చేస్తా

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

కొత్తగూడ: గుంజేడు ముసలమ్మ జాతరను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పంచాయతీరాజ్‌, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. జాతరలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన వ్యాపార సముదాయాన్ని గురువారం ఆమె ప్రారంభించి, ఉత్సవ కమిటీని సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గతంలో అటవీశాఖ అనుమతులు రాకపోవడం వల్ల జాతర అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నేడు అదే అటవీశాఖ సహకారంతో రూ.కోటి నిధులతో వ్యాపార సముదాయం, భక్తులకు షెడ్లు, మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. మరో రూ.3కోట్ల నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మార్చిలో ముసలమ్మ జాతర నిర్వహణ కోసం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. జాతర నిర్వహణలో సంప్రదాయాలకు విఘాతం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అడవిబర్రె దాడిలో మృతి చెందిన కార్లాయి గ్రామస్తుడు కల్తి గోవింద్‌ కుటుంబానికి అటవీశాఖ ద్వారా మంజూరైన రూ.10లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సీసీఎఫ్‌ఓ భీమానాయక్‌, డీఎఫ్‌ఓ విశాల్‌, ఎఫ్‌డీఓ చంద్రశేఖర్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఆలయ పూజా రులు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement