మానుకోటలోనే రైల్వే డిపో ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మానుకోటలోనే రైల్వే డిపో ఏర్పాటు చేయాలి

Feb 27 2026 4:25 AM | Updated on Feb 27 2026 4:25 AM

మానుకోటలోనే రైల్వే డిపో ఏర్పాటు చేయాలి

మానుకోటలోనే రైల్వే డిపో ఏర్పాటు చేయాలి

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోనే రైల్వే మెగా ఫ్రైట్‌ మెయింటెనెన్స్‌ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ మల్లాడిని గురువారం డిపో సాధన కమిటీ బాధ్యులు కలిసి కలిసి విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీఆర్‌ఎం రైల్వేబోర్డు ఆమోదానికి పంపనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మెగాడిపో ఏర్పాటుకు స్థలం ఇస్తున్నట్లు ప్రతి పాదనలు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్‌ అజ్మీరా సీతారాంనాయక్‌, రైల్వే డిపో సాధన కమిటీ బాధ్యులు డోలి సత్యనారాయణ, మైస శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్‌, రజక సంఘం, టీపీజేఏసీ నాయకులు మహమ్మద్‌ ఫరీద్‌, దుగ్గి గోపాల్‌, బుర్ర గోవర్ధన్‌ పాల్గొన్నారు.

పీఎం విశ్వకర్మ పథకంతో ఆర్థికంగా ఎదగాలి

మహబూబాబాద్‌: పీఎం విశ్వకర్మ పథకం ద్వారా చేతివృత్తుల వారు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ శ్రీమన్నారాయణ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న కా లానికి అనుగుణంగా ఆన్‌లైన్‌ వేదికగా ఉత్పత్తుల విక్రయాలు చేపట్టాలన్నారు. వస్తువుల నా ణ్యతతో పాటు ఆకర్షణీయంగా ప్యాకింగ్‌ చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతివృత్తులకు వారికి అందిస్తున్న రాయితీలు, రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ, ఏఐటీసీల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌యోజన్‌ 4.0కింద త్రీడీ ప్రింటింగ్‌ కోర్సులో 20 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ కోసం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌. బాబు గురువారం తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు 3నెలల పాటు శిక్షణ చేపట్టి ప్రభుత్వం నుంచి పాస్‌ సర్టిఫికెట్లు అందజేస్తాన్నారు. మార్చి 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. వివరాలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు.

బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌లో..

బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ 2026–27 విద్యా సంవత్సరంలో నాన్‌ రెసిడెన్షియల్‌, రెసిడెన్షియల్‌ పథకంలో ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడానికి జిల్లాలోని ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి కె. శ్రీనివా స్‌రావు గురువారం తెలిపారు. ఈ నెల 27నుంచి మార్చి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, పూర్తి వివరాలకు షెడ్యూల్‌ కులాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. 1వ తరగతి విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు, నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలు, రెండు జతల స్కూల్‌ యూనిఫాంతో ప్రతీ విద్యార్థికి రూ.28వేలు చెల్లిస్తారని, రెసిడెన్షియల్‌ విద్యార్థులకు వసతితో పాటు రూ.42 వేల చొప్పున చెల్లిస్తారని చెప్పారు.

ప్రైవేట్‌ స్కూల్‌లో

విద్యార్థుల ఘర్షణ

తొర్రూరు: తొర్రూరు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో విద్యార్థులు ఘర్షణ పడిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల కథనం ప్రకారం.. పెద్దవంగర మండలానికి చెందిన విద్యార్థులు ఓ ప్రైవేట్‌ స్కూల్‌ హాస్టల్‌లో ఉంటూ 5వ, 6వ తరగతులు చదువుకుంటున్నారు. ఈక్రమంలో మంగళవార ం రాత్రి ఇరువురు విద్యార్థులు గొడవపడి ఫైటింగ్‌ చేయగా, సమాచారం తెలుసుకున్న హాస్టల్‌ వార్డెన్‌ వారిని మందలించారు. అంతేకాకుండా గొడవ పడిన విద్యార్థుల్లో ఒకరు తాను నిద్రిస్తుండగా టవల్‌తో మెడకు ఉరిపెట్టాడని ఆరోపిస్తూ తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఈమేరకు సదరు విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్‌ కు వచ్చి యాజమాన్యంతో వాగ్వాదం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థ లానికి చేరుకోని ఇరువురిని సముదాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement