మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలి

Feb 27 2026 4:25 AM | Updated on Feb 27 2026 4:25 AM

మున్స

మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలి

ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌

నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

కేసముద్రం: నూతన పాలకవర్గం సమన్వయంతో పనిచేసి, కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ అన్నారు. గురువారం కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బానోత్‌ సునీత, వైస్‌చైర్‌పర్సన్‌ అల్లం రమ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ సలహా దారు వేం నరేందర్‌రెడ్డి సహకారంతో ఇప్పటికే కేసముద్రం ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందన్నారు. కొత్తగా ఏర్పడిన పాలకవర్గం నిరంతరం ప్రజల మధ్య ఉండాలన్నారు. వార్డుల్లో నెలకొన్న ప్రతీ సమస్యను తక్షణమే పరిష్కరించేలా చూడాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్‌ సహకారం ఎప్పటికీ ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లకు పలువురు శాలువాలు కప్పి అభినందించారు. కాంగ్రెస్‌ కౌన్సిలర్లు బాదావత్‌ కిషోర్‌, కనుకుల సుభద్ర, వేముల భారతి, తరాల వీరేశ్‌, బానోత్‌ విజయ, వల్లందాసు ఉమ, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు జాటోత్‌ సుజాతహరీశ్‌నాయక్‌, డి.క్రిష్ణ, పురం రాజమణి, పాయిరాల శరత్‌యాదవ్‌, రావుల వినయ్‌రెడ్డి, మేక ల శారద, ఆగె రాము, బానోత్‌ అరుణకుమారి, వివిఽ ద పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

డోర్నకల్‌ పాలకవర్గం..

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం గురువారం బాధ్యతలు స్వీకరించింది. మున్సి పల్‌ చైర్‌ పర్సన్‌ కొండేటి రాజకుమారి, వైస్‌ చైర్‌పర్సన్‌ మాదా లావణ్య, వార్డు కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన పాలకవర్గాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ నిరంజన్‌, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి చేస్తాం

తొర్రూరు: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టణాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం డివిజన్‌ కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఇటీవల చైర్మన్‌గా ఎన్నికై న శ్రావణ్‌కుమార్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ రజినీ, కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వ మ్ము చేయకుండా మున్సిపల్‌శాఖతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. టీ పీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝూన్సీరెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, మండల, పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలి1
1/2

మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలి

మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలి2
2/2

మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement