రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణంపాలైన ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్ బ్లూకోల్ట్స్ సిబ్బంది రాజు, అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శనిగపురం గ్రామ శివారు చాంప్లా తండాకు చెందిన గుగులోత్ హసేన్ (32) తన ద్విచక్ర వాహనంపై జిల్లా కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్నాడు. శనిగపురం గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో హసేన్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జుకాగా.. హసేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మంజుల, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హసేన్ మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.


