రోప్ పార్టీ @500 మంది
మేడారం(వరంగల్ క్రైం): జాతరలో తల్లులను గద్దెలపైకి తీసుకొచ్చేందుకు భద్రతకు ఏర్పాటుచేసిన రోప్ పార్టీలో ములుగు అదనపు ఎస్పీ సదానందం ఆధ్వర్యంలో సుమారు 500 మంది సిబ్బంది ఉన్నారు. రోప్ పార్టీ సిబ్బంది పూజారులు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విధులు నిర్వర్తించాలని సదానందం సూచించారు. బుధవారం సారలమ్మను తీసుకొచ్చిన రోప్‌పార్టీ విధుల్లో సుమారు 300 మంది, రూట్ క్లియరెన్స్ విధుల్లో 200 మంది సిబ్బంది ఉన్నారు. జంగిల్ డ్రెస్సులు ధరించి, తలకు నల్లని వస్త్రాలు కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.


