ఫొటో ఓటరు జాబితా ప్రదర్శన
మహబూబాబాద్: మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పోలింగ్ స్టేషన్‌ల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను శుక్రవారం ప్రదర్శించారు. ఈసందర్భంగా టీపీఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ.. మానుకోట మున్సిపాలిటీ పరిరిధిలోని 36 వార్డుల్లో 88 పోలింగ్ స్టేషన్లతో జాబితా పూర్తి చేశామన్నారు. ఆ జాబితాను ప్రజలు సౌకర్యార్థం మున్సిపాలిటీ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం నోటీస్ బోర్డుపై ఏర్పాటు చేశామన్నారు. మేనేజర్ శ్రీధర్, సిబ్బంది సుధాకర్, రమేష్, నాగేశ్వర్‌రావు, మమ్ముట్టి, అమర్ ఉన్నారు.
తొర్రూరు మున్సిపాలిటీలో..
తొర్రూరు: స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం ఫొటో ఓటరు జాబితాను ప్రకటించారు. 16 వార్డుల్లో మొత్తం 21,451 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 19,100 ఓటర్లు ఉండగా ప్రస్తుతం 2,351 మంది ఓటర్లు పెరిగారు. దీనిలో పురుష ఓటర్లు 10,501 ఉండగా, మహిళా ఓటర్లు 10,942 మంది ఓటర్లు, ఇతరులు 8 మంది ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితా అనంతరం స్థానికులు, రాజకీయ పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తుది ఫొటో ఓటరు జాబితా రూపొందించినట్లు కమిషనర్ వి.శ్యాంసుందర్ తెలిపారు. ఓటరు జాబితాను ప్రజల సౌకర్యార్థం మున్సిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంచనున్నామన్నారు.


