ఎన్పీడీసీఎల్‌కు ఇప్పాయి పవర్ అవార్డు
హన్మకొండ: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకుంది. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఇప్పాయి) వారు ప్రకటించిన ‘ఇప్పాయి పవర్ అవార్డ్స్–2026’లో టీజీఎన్పీడీసీఎల్ ‘ఇన్నోవేషన్ అవార్డు’ను అందుకుంది. ఈ నెల 10వ తేదీన కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన 26వ‘రెగ్యులేటర్స్– పాలసీమేకర్స్ రిట్రీట్’ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ సురేందర్ ఈ అవార్డును అందుకున్నారు. కాగా శుక్రవారం హనుమకొండ, నక్కలగుట్టలోని కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డికి చీఫ్ ఇంజనీర్ సురేందర్ ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్‌లో ప్రవేశపెట్టిన వినూత్న సాంకేతిక పద్ధతుల వల్లే ఈ అవార్డు దక్కిందని తెలిపారు.
ఎన్పీడీసీఎల్‌కు ఇప్పాయి పవర్ అవార్డు


