శరణు శరణు..
ఐలోని మల్లన్న
ఐనవోలు: సంక్రాంతి సందర్భంగా ఐనవోలు మల్లన్న జా తర భక్తులతో హోరెత్తింది. భక్తులు వేలాదిగా తరలివచ్చా రు. శివసత్తులు భక్తి పారవశ్యంతో నెత్తిన బోనంతో నాట్యం చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. సంతానం కో సం కొందరు మహిళలు ఆలయం చుట్టూ వరం పట్టారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు
మకర సంక్రాంతిని పురస్కరించుకుని స్వామివారికి ఆల య ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద విని యోగంతోపాటు వేద పారాయణం చేశారు. అదేవిధంగా ఆలయ ఆవరణలో ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు.
మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు
మకర సంక్రాంతి రోజు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్వామి వారిని దర్శించుకుని విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో త్వరలో సుపరిపాలన అందించే ప్రభుత్వం రావాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, మార్తినేని ధర్మారావు, నాయకులు రాజేశ్వర్‌రావు, కాళీ ప్రసాద్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తదితరులు మల్లన్నను ద ర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కనుమ రోజు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు గడ్డం రఘువంశీ, ఆడెపు స్రవంతి దయాకర్, నాయకులు పాల్గొన్నారు.
మార్నేని వంశస్తుల పెద్ద రఽథం
మార్నేని వంశస్తులు పెద్ద రథం నిర్వహించారు. టెస్కాబ్ మాజీ చైర్మన్, పెద్ద రథం నిర్వాహకుడు మార్నేని రవీందర్‌రావు ఇంటి నుంచి శిడిరథం (రాత్రి ప్రభ బండి) సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరింది. ఆలయ ప్రాంగణంలోని తూర్పు ద్వారం వద్ద రథంలో వెంట తెచ్చిన పెట్టెను ఆలయంలోకి తీసుకెళ్లి మొక్కులు చెల్లించారు. రథం నిర్వాహకుడు మార్నేని రవీందర్‌రావును ఈఓ కందుల సుధాకర్, ఆలయ ధర్మకర్తలు శాలువాతో సత్కరించారు.
పెద్ద రథం నిర్వహించిన మార్నేని వంశస్తులు
బోనాలు, పట్నాలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు
శరణు శరణు..
శరణు శరణు..


