ముగిసిన ఖోఖో చాంపియన్‌షిప్ పోటీలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం నిర్వహించిన 58వ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్‌షిప్‌లో ఇండియన్ రైల్వే జట్టు విన్నర్‌గా నిలిచి చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. కాజీపేటలో ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన నేషనల్ ఖోఖో పోటీలు 15వ తేదీన గురువారం ముగిశాయి. మహిళల ఫైనల్స్‌లో మహారాష్ట్ర జట్టు 23–22 స్కోర్‌తో ఒడిశాను ఓడించింది. ప్రియాంక ఇంగ్లే ఆల్ రౌండ్ ప్రతిభకు తోడు సంధ్య సుర్వస్తే డిఫెన్స్‌లో రాణించి స్వర్ణ పతాకాన్ని గెలిచారు. ఒడిషా జట్టులో అర్చప్రధాని, అర్చన మంగల్ మంచి ప్రతిభను కనబరిచారు. పురుషుల్లో ఇండియన్ రైల్వేస్ జట్టు సమష్టి కృషితో వరుసగా రెండోసారి చాంపియన్‌షిప్ సాధించింది. ఫైనల్‌లో రైల్వేస్ 26–21 స్కోర్‌తో మహారాష్ట్రను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రైల్వేస్‌లోని అంతర్జాతీయ ఆటగాడు రాంజీకశ్యప్, మహేష్ షిండే, జగన్నాథ్ దాస్ రాణించగా, మహారాష్ట్రలోని ప్రతిక్ వైకర్, శుభంథోరట్, అనికేత్ చెంద్వానే మంచి నైపుణ్యం కనబరిచారు. పురుషుల విభాగంలో మూడు, నాల్గవ స్థానంలో కొల్హాపూర్, ఒడిషా, మహిళల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ జట్లు నిలిచాయి.
ఉత్తమ క్రీడాకారులు
ఈ చాంపియన్‌షిప్‌లో ప్రతిష్టాత్మక ఏకలవ్య, రాణిలక్ష్మి అవార్డులతోపాటు బెస్ట్ ఆల్ రౌండర్ పురస్కార్‌లను రాంజీ కశ్యప్ (రైల్వేస్), సంధ్య సుర్వసే (మహారాష్ట్ర) అవార్డులు ప్రదానం చేశారు. బెస్ట్ డిఫెండర్లుగా ప్రతిక్ వైకర్(మహారాష్ట్ర), అర్చనప్రధాన్ (ఒడిశా) బెస్ట్ అటాకర్‌లుగా అభినందన్ పాటిల్ (రైల్వేస్) ప్రియాంక ఇంగ్లే (మహారాష్ట్ర)లు అవార్డులు అందుకున్నారు. వీరికి జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేశారు. జంగా రాఘవరెడ్డి అన్నితానై ఆటగాళ్లకు ఏ లోటూ లేకుండా సౌకర్యాలు కల్పించినట్లు ఖోఖో సంఘం, ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ పోటీలో ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు భంవార్ సింగ్ పలాడ, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉప్కార్‌సింగ్ విర్క్, ఫెడరేషన్ టోర్నమెంట్స్ చైర్మన్ ఎం.ఎస్.త్యాగి, ఫెడరేషన్ ఎథిక్స్ కమిషన్ చైర్మన్ తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, తెలంగాణ, వరంగల్ జిల్లా అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శులు నాతి కృష్ణమూర్తి, అర్జున అవార్డి శోభ నారాయణ్, తోట శ్యాంప్రసాద్, టెక్నీకల్ అఫీషియల్స్, రాజారపు రమేష్, కుసుమ సదానందం, సురేంద్ర విశ్వకర్మ పాల్గొన్నారు.
పురుషుల విభాగంలో విజేత రైల్వేస్,
రన్నర్‌గా మహారాష్ట్ర
మహిళల విభాగంలో విన్నర్
మహారాష్ట్ర, రన్నర్ ఒడిశా
ముగిసిన ఖోఖో చాంపియన్‌షిప్ పోటీలు


