పోటెత్తిన భక్తజనం
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన సుమా రు 75 ఎడ్లబండ్ల రథాలు, వేలేరు నుంచి వచ్చిన మేకల రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, హనుమకొండ తదితర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించినట్లు ఆలయ ఈఓ పి.కిషన్‌రావు తెలిపారు. శుక్రవారం కనుమ ఉత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మండప పూజ, నందీశ్వర పూజ, అభిషేకం, హా రతి, మంత్రపుష్పం, బలిహరణ నిర్వహించారు. సెంటల్ జోన్ డీసీపీ ధార కవిత స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. కాజీపేట ఏసీపీ ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు, జాతర బందోబస్తు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాంబాబు, రాజయ్య, వినయ్‌శర్మ, ఆలయ చైర్మన్ అశోక్‌ముఖర్జీ, భక్తులు పాల్గొన్నారు.
కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లు, మేకల బండ్లు


