సిర్పూర్‌కాగజ్‌నగర్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్
కాజీపేట రూరల్: న్యూఢిల్లీ–తిరువనంతపురం–న్యూఢిల్లీ మధ్య ప్రయాణించే కేరళ ఎక్స్‌ప్రెస్‌కు కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని సిర్పూర్‌కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో నేటి(శనివారం)నుంచి దక్షిణ మధ్య రైల్వే హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. న్యూఢిల్లీ–తిరువనంతపురం సెంట్రల్ (12626) వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్ సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు సాయంత్రం 16:09 గంటలకు చేరుకుంటుంది. తిరువనంతపురం సెంట్రల్–న్యూఢిల్లీ (12625) వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్ సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు సాయంత్రం 17:14 గంటలకు చేరుకుంటుంది.
జాతరకు వెళ్లొచ్చేలోపు చోరీ
నెక్కొండ: సంక్రాంతి పర్వదినం, మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందస్తుగా హెచ్చరిక చేస్తున్నా.. తాళం వేసిన ఇళ్లను టార్కెట్ చేసిన దొంగలు తమపని తాము చేసుకెళ్తున్నారు. మండలంలోని అప్పల్‌రావుపేటలో ఓ కుటుంబం జాతర వెళ్లగా వారి ఇంట్లో దొంగలు తమచేతివాటం ప్రదర్శించారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన యాసం కుమారస్వామి తన పెద్ద కుమారుడైన సంజీవరాజ్ కుటుంబం సభ్యులతో కలిసి ఈ నెల 15న మేడారం జాతరకు వెళ్లాడు. ఉదయం అతని చిన్న కుమారుడు సంపత్‌రాజ్ వారి ఇళ్ల వద్దకు వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో పోలీసులకు ఆయన సమాచారమందించగా క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. అదే రోజు రాత్రి ఇంటి తాళాలను గుర్తు తెలియని వ్యక్తలు పగలగొట్టి కుమారస్వామి ఇంట్లోని బీరువాను తెరిచారు. అందులోని నాలుగు తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.20 వేలు అపహరించారు. సంజీవరాజ్ ఇంటి తలుపులు పగుల గొట్టినప్పటికీ చోరీ జరగలేదని ఎస్సై వివరించారు. సంపత్‌రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
● 4 తులాల బంగారం.. 10 తులాల
వెండి, రూ.20 వేల అపహరణ
● మండలంలోని అప్పల్‌రావుపేటలో ఘటన


