మహాజాతరకు విద్యుత్‌శాఖ సిద్ధం
● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతరకు విద్యుత్‌శాఖ సిద్ధమైందని, పనులన్నీ తుదిదశకు చేరుకున్నాయిని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనతోపాటు మేడారంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈనెల 18న జరగనున్న నేపథ్యంలో జాతరలో విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ భద్రత విషయంలో రాజీపడకుండా తొలిసారి కవర్డ్ కండక్టర్ ఏర్పా టు చేశామని తెలిపారు. కన్నెపల్లి సారలమ్మ ఆల యం వద్ద విద్యుత్ లైన్లను తనిఖీ చేసి ట్రాన్స్‌ఫార్మర్లన్నింటికీ ఫెన్సింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు . విద్యుత్ భద్రత దృష్ట్యా ఎల్టి లైన్లలో స్పేసర్స్ పెట్టడం జరిగిందని వివరించారు. దాదాపు 350 మంది సిబ్బంది జాతరలో విధులు నిర్వర్తిస్తున్నారని, ఏజెన్సీలు కూడా ఇందులో ఉంటారని తెలిపారు. అందరికి డ్యూటీ చార్జ్‌లు వేశామన్నారు. జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుగానే అన్ని పనులు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్ మోహన్‌రావు, చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్, ఎస్‌ఈ మల్చూరు, డీఈ నాగేశ్వర రావు, కన్‌స్ట్రక్షన్ ఏడీ సదానందం, సందీప్, డీఈ టెక్నికల్ భాస్కర్ పాల్గొన్నారు.


