మనగడ్డపై ఆడడం సంతోషంగా ఉంది
కాజీపేట రైల్వే స్టేడియంలో జరుగుతున్న 58వ జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. మన జిల్లా.. గడ్డ.. మన రాష్ట్ర జట్టుతో కలిసి ఆడడం ఆనందంగా ఉంది. ఇప్పటికి 13 నేషనల్స్‌లో ఆడా, 14వ నేషనల్ కాజీపేటలో ఆడుతున్నా. తెలంగాణ జట్టకు కెప్టెన్‌గా ఉండడం సంతోషంగా ఉంది.
–న్యాతకాని రాకేశ్, తెలంగాణ కెప్టెన్,
ఆత్మకూరు మండలం, నీరుకుళ్ల
ఖోఖోకు మరింత
ప్రాచుర్యం పెరిగింది
కాజీపేట స్టేడియంలో జరుగుతున్న 58వ జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీలతో దేశవ్యాప్తంగా ఖోఖో క్రీడకు మరింత ప్రాచుర్యం పెరిగింది. ఇప్పటి వరకు ఒక సబ్‌జూనియర్, మూడు జూనియర్స్, మూడు ఖేలో ఇండియా, ఒక నేషనల్, రెండు సీనియర్ నేషనల్స్ ఆడా. ఢిల్లీలో జరిగిన వరల్డ్ కప్ క్యాంప్ చేశా. ఈ పోటీలు మన ప్రాంతంలో జరగడం ఆనందంగా ఉంది.
–వి.జానకీరాం,
కుల్కచర్ల, రంగారెడ్డి జిల్లా
మనగడ్డపై ఆడడం సంతోషంగా ఉంది


